Header Banner

విశాఖలో దారుణం.. ఎన్నారై మహిళ అనుమానాస్పద మృతి! హత్యా? ఆత్మహత్యా?

  Sun Mar 09, 2025 08:44        India

విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో ఎన్నారై మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శనివారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. సీతమ్మధారకు చెందిన మహిళ (48) అమెరికాలో స్థిరపడ్డారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నగరానికే చెందిన వైద్యుడు శ్రీధర్ (52) కూడా అమెరికాలోనే స్థిరపడ్డారు. వీరిద్దరి మధ్య స్నేహం ఉన్నట్టు తెలిసింది. నెల రోజుల క్రితమే వైజాగ్ వచ్చిన శ్రీధర్ ఓ హోటల్ గదిలో ఉంటున్నాడు. ఓ ప్రైవేటు స్థలం లీజు అగ్రిమెంట్ కోసం ఎన్నారై మహిళ కూడా ఇటీవల విశాఖ వచ్చారు. శ్రీధర్ గదిలోనే ఆమె కూడా ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆమె హోటల్ గదిలోని బాత్రూంలో షవర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు శ్రీధర్ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 80 కిలోమీటర్ల దూరంలో..

 

అయితే, బాత్రూంలో ఉరి వేసుకున్నట్టు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉంటుందని శ్రీధర్ వాంగ్మూలంలో పేర్కొనడం అనుమానాలకు తావిచ్చింది. కాగా, ఈ ఘటనకు ముందు శ్రీధర్ ఫోన్‌లోని మహిళల వీడియోలపై ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఆత్మహత్య ఆనవాళ్లు లేకపోవడంతో హత్య జరిగిందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఆమె ఒంటిపై దాదాపు రూ. 20 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్టు తెలిసింది. కాగా, సమాచారం అందుకున్న మహిళ భర్త శనివారం వైజాగ్ వచ్చి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఆమె మృతిపై నెలకొన్న మిస్టరీ వీడుతుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!

 

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూ, వారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందా? లేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NRIDead #CrimeNews #Visakhapatnam #NRIWoman